షేర్: f 𝕏 ✉ ✈ in @
96media.in 20 నవం 2026, 3:58 ఉద.
రాజకీయాలు

డిసెంబర్‌లో విదేశీ పర్యటనకు మంత్రి నారా లోకేశ్

తాజా వార్తలు – ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, అనకాపల్లి
ప్రచురణ తేదీ: 20 నవం 2026, 3:58 ఉద. రచన: One News Desk
8 వీక్షణలు 0 వ్యాఖ్యలు
డిసెంబర్‌లో విదేశీ పర్యటనకు మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విదేశీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌తో పాటు యూకే రాజధాని లండన్‌లో ఆయన పర్యటించనున్నారు. కోపెన్‌హేగన్‌లో నిర్వహించే ‘ఏఐ ఫర్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ ఫోరం’లో పాల్గొనేందుకు ఈ పర్యటనను ఖరారు చేశారు.

జీఓఆర్టీ నెం. 2172 జారీ

ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు నవంబర్ 19న జీఓఆర్టీ నెం. 2172 ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి కార్యాలయం పంపిన ప్రతిపాదనల మేరకు ఈ అనుమతులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Nara Lokesh: కేంద్ర అనుమతులు.. ఖర్చుల వివరాలు

ఈ విదేశీ పర్యటనకు సంబంధించి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహా ఇతర సంబంధిత కేంద్ర విభాగాల నుంచి తప్పనిసరిగా రాజకీయ అనుమతులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్యటన ఖర్చులను ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ భరించనుండగా, ప్రయాణ సమయంతో కలుపుకుని మొత్తం ఆరు రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది.

#రాజకీయాలు
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విదేశీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డెన్మార్క్…