షేర్: f 𝕏 ✉ ✈ in @
96media.in 16 నవం 2026, 3:33 ఉద.
క్రీడలు

Sachin Tendulkar: 49 ఏళ్ల త‌ర్వాత… చిన్న‌నాటి బ్యాట్‌తో సేమ్ ఫోజులో.. ఫోటోను పోస్టు చేసిన స‌చిన్‌

తాజా వార్తలు – ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, అనకాపల్లి
ప్రచురణ తేదీ: 16 నవం 2026, 3:33 ఉద. రచన: One News Desk
8 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Sachin Tendulkar:  49 ఏళ్ల త‌ర్వాత… చిన్న‌నాటి బ్యాట్‌తో సేమ్ ఫోజులో.. ఫోటోను పోస్టు చేసిన స‌చిన్‌

ముంబై: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్(Sachin Tendulkar) త‌న తీపి జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. స‌చిన్ ఫోటో ఆల్బ‌మ్‌లో చిన్న‌ప్పుడు బ్యాట్‌తో దిగిన ఫోటో క్రికెట్ అభిమానుల‌కు సుప‌రిచిత‌మే. అయితే ఆ నాటి బ్యాట్‌తోనే మ‌ళ్లీ సేమ్ ఫోజులో ఫోటో దిగాడు స‌చిన్‌. 49 ఏళ్ల క్రితం ఆ బ్యాట్‌తో దిగిన ఫోటోతో పాటు కొత్త ఫోటోను ఇన్‌స్టాలో స‌చిన్ అప్‌లోడ్ చేశారు. పెహ్లీ బ్యాట్ కీ బాత్ హై, 49 సాల్ బాద్ బీ మేరా సాత్ హై అన్న ట్యాగ్‌లైన్‌తో రెండు ఫోటోల‌ను స‌చిన్ త‌న అకౌంట్‌లో పోస్టు చేశారు.

చిన్న‌నాటి జ్ఞాపకాల‌ను స‌చిన్ ఇంకా మ‌రువ‌లేద‌న్న దానికి ఆ బ్యాట్ నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌ది. 49 ఏళ్లుగా ఆ బ్యాట్‌తో త‌న‌తో ఉన్న‌ట్లు చెప్పారు. స‌చిన్ త‌న చిన్న‌నాటి స్మృతుల‌ను నెమ‌రేసుకున్న తీరుపై అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. మాస్ట‌ర్‌తో పాటు న‌మ్మ‌క‌మైన అత‌ని స‌హ‌చ‌రి అని ఓ అభిమాని రాశాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ అని మ‌రో వ్య‌క్తి ఆ పోస్టుపై రియాక్ట్ అయ్యారు.

#క్రీడలు
ముంబై: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్(Sachin Tendulkar) త‌న తీపి జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. స‌చిన్ ఫోటో ఆల్బ‌మ్‌లో చిన్న‌ప్పుడు బ్యాట్‌తో దిగిన ఫోటో క్రికెట్ అభిమానుల‌కు సుప‌రిచిత‌మే. అయితే ఆ…