96 Media, 18 నవంబర్ 2026: Anudeep KV : జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు దర్శకుడు అనుదీప్. తన మాటలతో, టీవీ షోలో కామెడీ పంచులతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్, ఫంకీ సినిమాలతో కూడా నవ్వించాడు. పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసి నవ్వించారు. ఇన్ని రోజులు నవ్విస్తున్న అనుదీప్ ఒక్కసారిగా సీరియస్ పుస్తక రచయితగా మారిపోయారు.
అనుదీప్ నుంచి బుక్ అంటే ఏదో కామెడీ బుక్ వస్తుంది అనుకుంటారు కానీ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే లైఫ్ కి సంబంధించిన పుస్తకాన్ని రాశారు. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో, సెల్ ఫోన్, టెక్నాలజీ యుగంలో ఆనందాన్ని, ప్రశాంతతను శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో చెప్పడానికి ఈ పుస్తకం రాసారంట. దాదాపు మూడేళ్లు కష్టపడి, మైండ్, మనసు, శరీరం పై, న్యూరో సైన్స్ లో రీసెర్చ్ చేసి మనుషులు హ్యాపీగా ఉండటానికి ఒక సైకాలజిస్ట్ లా ఈ పుస్తకాన్ని రాశారు అనుదీప్.
మనం మంచి అలవాట్లను ఎందుకు వాయిదా వేస్తాం, ఫోన్ స్క్రోలింగ్ ఇచ్చే చీప్ డోపమైన్ ఉచ్చులో ఎలా పడిపోతున్నాం, మనం తినే ఆహారం, మన నిద్ర మన మెదడును ఎలా శాసిస్తున్నాయి.. లాంటి పలు విషయాలను ప్రాక్టికల్ గా వివరించారు ఈ పుస్తకంలో. ఆటోపైలట్ మోడ్ నుండి బయటపడి జీవితాన్ని నిజంగా ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని అనుదీప్ తెలిపారు. మనమందరం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు ఈ పుస్తకంలో సమాధానాలు ఉన్నాయట.
ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. ప్రముఖ పుస్తకాల షాపులలో, అమెజాన్ లో ఈ పుస్తకం దొరుకుతుంది. తెరపై, తెరవెనక నవ్వించే దర్శకుడు అనుదీప్ కెవి ఇలా పుస్తక రచయితగా మారి బివి పట్టాభిరామ్ స్టైల్ లో ఇవాళ్టి కాలంలో జనాలకు లైఫ్ కి ఉపయోగపడే ఇలాంటి పుస్తకం రాస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ పుస్తకం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చదవొచ్చు.