Raptadu Accused Hemanth: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన సంచలన కేసులో నిందితుడు హేమంత్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యాడు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (GGH) ఐదు రోజుల పాటు సాగిన చికిత్స అనంతరం అతడు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ప్రస్తుతం హేమంత్‌ను భారీ బందోబస్తు మధ్య కర్నూలు నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు.

Raptadu Accused Hemanth: రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో కర్నూలు ఆస్పత్రికి తరలింపు
ఘటన అనంతరం నిందితుడు హేమంత్ రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందన్న (బ్లడ్ క్లాట్) ఆరోగ్య సమస్య తలెత్తడంతో, మెరుగైన వైద్యం కోసం పోలీసులు అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గత ఐదు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్స అందించిన తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది.
వైద్యుల సూచన మేరకు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేసిన అనంతరం, కేసు తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు నిందితుడు హేమంత్‌ను అనంతపురానికి తీసుకెళ్తున్నారు. అనంతపురం చేరుకున్న తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచే ప్రక్రియను పోలీసులు చేపట్టనున్నారు.