Bigg Boss 10 Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఊహించని మలుపులతో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో విజయవంతంగా పదో వారాన్ని పూర్తి చేసుకుంది. అయితే, పదో వారం ఎలిమినేషన్లో ప్రేక్షకులు ఏమాత్రం ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నీతూ మాస్టర్, సుధీర్ లేదా రామకృష్ణలలో ఒకరు బయటకు వెళ్తారని అంతా భావించగా, అనూహ్యంగా ‘ఢీ’ ఫేమ్ డ్యాన్సర్ శ్వేత నాయుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 10 Week Elimination: అంచనాలను తలకిందులు చేసిన ఓటింగ్
పదో వారం నామినేషన్స్‌లో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, శ్వేత, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, రామకృష్ణ, శివకుమార్ నిలిచారు. వీరిలో ఓటింగ్ పరంగా శివకుమార్ చివరి స్థానంలో ఉన్నారని, రామకృష్ణ, నీతూ మాస్టర్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రామకృష్ణతో పాటు నీతూ మాస్టర్ కూడా బయటకు వస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ ఓట్లు సాధించిన శ్వేత నాయుడు ఎలిమినేట్ అవ్వడం షాక్‌కు గురిచేసింది.
ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలు ఇవేనా?
‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేత నాయుడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. మొదటి నుంచి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పోలిస్తే ఆమెకు బలమైన ఓటు బ్యాంకు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఆటల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా కనిపించకపోవడం, ఏ ఒక్క టాస్కులోనూ బలమైన ముద్ర వేయలేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. దీనికి తోడు ఇటీవల తోటి కంటెస్టెంట్ అమన్‌తో ఆమెకు సాన్నిహిత్యం పెరగడం, అర్ధరాత్రి ముచ్చట్లు వంటి కారణాలతో బయట కొంత నెగెటివిటీ ఏర్పడింది. హౌస్‌లోని సభ్యులందరూ నామినేషన్స్‌లో ఉన్న ఈ వారంలో, ఈ అంశాలన్నీ ఆమె ఓటింగ్‌పై ప్రభావం చూపాయి.
ఐదు వారాలకు శ్వేత అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శ్వేత నాయుడు బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం ఐదు వారాల పాటు కొనసాగారు. పదో వారం ఎలిమినేషన్‌తో ఆమె ప్రయాణం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె పారితోషికానికి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమాచారం ప్రకారం, శ్వేత నాయుడు వారానికి రూ. 1.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఐదు వారాలకు గాను ఆమె మొత్తం రూ. 7.5 లక్షల వరకు సంపాదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.