- బంగారం, వెండి కొనాలనుకునేవారికి అలర్ట్..
- ఐఫోన్ ధరకు పడిపోయిన బంగారం, వెండి రేట్లు
- ఐఫోన్ 17 ప్రో ధరలోనే 10 గ్రాముల బంగారం
Gold-iPhone Prices : బంగారం, వెండి కొనాలని చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇటీవల ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి.
ముఖ్యంగా బంగారం, వెండి ధరలను చూస్తుంటే.. ఒక కొత్త ఐఫోన్ కొనేసుకోవచ్చు అన్నంతగా ఆసక్తి రేపుతున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాల అంచనాలతో ఈ పసిడి, వెండి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు :
నవంబర్ 18, బుధవారం రోజున మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర భారీగా తగ్గింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు ఏకంగా రూ.3,158 తగ్గి రూ.1,31,065 స్థాయికి చేరింది. అంటే ఒక్కరోజులోనే సుమారు 2.35 శాతం పతనమైంది అనమాట..
ఇక వెండి పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది.. కిలో వెండి ధర రూ.6,169 తగ్గి రూ.1,63,533కు చేరింది. దాదాపు 3.63 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది గరిష్ఠ ధరలతో పోలిస్తే.. బంగారం సుమారు 27.5 శాతం, వెండి దాదాపు 61 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది..
ఐఫోన్ ధరతో దగ్గరగా బంగారం, వెండి :
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1.31 లక్షల నుంచి రూ.1.38 లక్షల మధ్య ఉంది. ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధరకు దగ్గరగా ఉంది. అలాగే కిలో వెండి ధర కూడా ఐఫోన్ 18 ప్రో బేస్ మోడల్ ధరతో దాదాపు సమానంగా కనిపిస్తోంది..
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? :
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు, డాలర్ బలపడటం బంగారం, వెండిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు వెండికి సంబంధించిన పారిశ్రామిక డిమాండ్ బలహీనంగా ఉండటం కూడా ధరల తగ్గుదలకు కారణమవుతోంది. అయితే, ధరలు తగ్గాయని వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకోవద్దు.. స్థానిక మార్కెట్ ధరలు, మేకింగ్ ఛార్జీలు, పన్నులను కూడా చెక్ చేయడం ఎంతైనా మంచిది..