96 Media, 18 నవంబర్ 2026: Upcoming Movies: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్ ఒక రచయిత పాత్రలో సరికొత్తగా కనిపించనుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్‌కు ఈ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వడం ఎంతో కీలకంగా మారింది. అయితే, వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ ‘అలియాస్ రుక్మిణి’ చిత్రానికి ఏకంగా రూ. 25 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నాని సమర్పణ, రొమాంటిక్ కామెడీ జానర్ కావడంతో ఈ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
Upcoming Movies: నాగచైతన్య ‘వృషకర్మ’తో భారీ పోటీ
మరోవైపు, బాక్సాఫీస్ వద్ద నితిన్‌కు గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ‘అలియాస్ రుక్మిణి’ విడుదలవుతున్న డిసెంబర్ 4వ తేదీనే అక్కినేని నాగచైతన్య నటించిన ‘వృషకర్మ’ చిత్రం కూడా థియేటర్లలోకి రానుంది. రెండు క్రేజీ సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద నితిన్‌కు భారీ సవాలు ఎదురుకానుంది. మరి ఈ పోటీని తట్టుకుని నితిన్ తన ఖాతాలో హిట్ వేసుకుంటారో లేదో చూడాలి.