96 Media, 18 నవంబర్ 2026: Protests : కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాసుకున్న ఆత్మకథ పుస్తకం (బిలాంగింగ్ : జర్నీ ఆఫ్ లవ్ (Belonging : A Journey of Love)) పై ఏక్నాథ్ షిండే (Eknath Shinde) వర్గం శివసేన (Shiv Sena) పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ పుస్తకంలో సోనియాగాంధీ.. చరిత్రను పూర్తిగా వక్రీకరించారని శివసేన నేతలు ఆరోపించారు. ఆ పుస్తకంలో వీర్ సావర్కర్ (Veer Savarker) ను కించపర్చారని మండిపడ్డారు.
ఈ మేరకు శివసేన నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా సోనియా పుస్తకంలో వీర్ సావర్కర్‌ను కించపర్చేలా ఉన్న పేజీలను వారు చింపేశారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న శివసేన నాయకుల్లో షైనా ఎన్సీ, సంజయ్ నిరుపమ్, ఆనంద్ దూబే తదితరులు ఉన్నారు. సోనియా ఆత్మకథలోని 201, 443 పేజీలలోని భాగాలను తొలగించాలని వారు పబ్లిషర్ హార్పర్ కాలిన్స్‌ను డిమాండ్ చేశారు.