Shiva Nirvana : ఇటీవల రవితేజ ఇరుముడి సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయ్యప్ప మాల, అయ్యప్ప స్వామి ఎమోషన్ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ ని జోడించి సరికొత్తగా మెప్పించి ప్రేక్షకులను ఏడిపించి హిట్ కొట్టారు ఇరుముడి సినిమాతో. ఈ సినిమాలో ఉన్న మూడు అయ్యప్ప స్వామి సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు అయ్యప్ప మాలల సీజన్ లో ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపిస్తున్నాయి.
ఇరుముడి సినిమా ఆల్మోస్ట్ 250 కోట్లు సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంత పెద్ద సక్సెస్ అనంతరం ఇరుముడి దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత రవి శంకర్ నేడు అయ్యప్ప మాల వేసుకున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ దేవస్థానంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నేడు ఉదయం వీరు మాల వేసుకున్నారు.
గతంలో శివ నిర్వాణ ఇరుముడి ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. సినిమా కోసం అయ్యప్ప మాల, అందులో ఎమోషన్, ఏం చేస్తారు, ఎలా అంటారు ఇవన్నీ తెలియడానికి నేను అయ్యప్ప మాల వేసుకున్నాను అని తెలిపారు. అలా సినిమా చేయడానికి అయ్యేప్ప మాల పరమార్థం తెలుసుకోవడానికి అప్పుడు వేయగా ఇప్పుడు సినిమా సక్సెస్ అయ్యాక మరోసారి మాల వేసుకున్నారు శివ నిర్వాణ.