Sircilla: కాంగ్రెస్ పార్టీకి మాజీ జెడ్పీటీసీల దంపతుల రాజీనామా
Sircilla: కాంగ్రెస్ పార్టీకి మాజీ జెడ్పీటీసీల దంపతుల రాజీనామా
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు, సిరిసిల్ల–తంగళ్లపల్లి మాజీ జెడ్పీటీసీలు పూర్మాని మంజుల, రామ్ లింగారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు తమ రాజీనామా పత్రాన్ని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి పంపించారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామని, అయితే ప్రస్తుత అనివార్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇంతకాలం పార్టీలో తమకు అండగా నిలిచి, సహకరించిన పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలందరికీ పూర్మాని మంజుల–రామ్ లింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.