96MEDIA – #AP INDIA

స్నేహ భావాన్ని పెంపొందించేవి క్రీడలే….మాజీ మంత్రి అవంతి

స్నేహ భావాన్ని పెంపొందించేవి క్రీడలే.

మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు అవంతి.

ఐపీఎల్ తరహాలో(ఎం.పి .ఎల్) మధురవాడ ప్రీమియర్ లీగ్.

అట్టహాసంగా ట్రోఫీ మరియు జెర్సీ ఆవిష్కరణ.మధురవాడ పరిసర ప్రాంత మాజీ క్రికెటర్లకు ఘన సన్మానం.

క్రీడల ద్వారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు.శారీరిక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత.!

సి.హెచ్.వివేకానంద.
ఏసీపీ దిశ

                                                                                                                    

96మీడియా, మధురవాడ:- స్నేహ భావాన్ని పెంపొందించేవి క్రీడలేనని మధురవాడ కు చెందిన యువత ప్రతిఒక్కరు సామాజిక స్ఫూర్తితో.. చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడా స్ఫూర్తిని చాటడం శుభపరిణామమని మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్ అన్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో
ఏప్రిల్ 15నుంచి 23వరకు జరగనున్న మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎం.పి.ఎల్. క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి శుక్రవారం సాయంత్రం క్రికెట్ స్టేడియం బి.మైదానంలో ట్రోఫీ మరియు జెర్సీల ఆవిష్కరణ,మరియు మధురవాడ పరిసర ప్రాంత మాజీ క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…. రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత సత్యనారాయణ,
సి.హెచ్.వివేకానంద,
ఏసీపీ దిశ,చుక్కశ్రీనివాసరావు ఏసీబీ నార్త్-సబ్ డివిజన్. కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మెంబర్ వంకాయల మారుతి ప్రసాద్,6వ వార్డు కార్పొరేటర్ ముత్తం శెట్టి ప్రియాంక పాల్గొని
సంయుక్తంగా.. ప్రారంభించారు.
ఈనెల15,నుండి23 వరకు జరిగే ఈక్రికెట్ పోటీలలో స్థానిక 5,6,7,8 వార్డుల నుండి సుమారు 8క్రికెట్ జట్లు(ఎం.డి.వి.రాక్ స్టార్స్, బి.వి.పి.బుల్స్, ఎండాడ హె.చ్సి.ఏ.ఎలివేన్స్, చంద్రంపాలెం ఎస్&డి టైగర్స్, కొమ్మాది లయన్స్,పరదేశి పాలెం క్రికెట్ ఆర్మీ,పి.ఎం.పి లెజెండ్స్,పి.కె.పి.రాయల్ స్ట్రైకర్స్)పోటీ పడుతున్నాయని మధురవాడ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత సత్యనారాయణ,
సి.హెచ్.వివేకానంద,
ఏసీపీ దిశ,6వ వార్డు కార్పొరేటర్ ముత్తం శెట్టి ప్రియాంక ప్రియాంక మాట్లాడుతూ…క్రీడల వలన శారీరిక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత కలుగుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందని,పసి వయస్సు నుండి క్రీడల మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లేనని,ఈతరం యువత క్రీడల పట్లమక్కువ చూపడం ఎంతో విశేషమన్నారు. ఆరోగ్యవంతమైన ఆటలతో యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం శుభ పరిణామమని అన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మెంబర్ వంకాయల మారుతి ప్రసాద్,సింహాచలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ముదుండి రాజేశ్వరి,మాజీ కార్పొరేటర్ జగుపిల్లి అప్పలరాజు,6వ వార్డు టిడిపి అధ్యక్షులు దాసరి శ్రీను,నక్కాశ్రీధర్, సీనియర్ నాయకులు వాండ్రాశి రవి,పిల్లా రమణబాబు,పోతిన ప్రసాద్, జనసేన 6వ వార్డు మహిళా నాయకురాలు పోతినఅనురాధ,నాగోతి ఆదినారాయణ(భాష),పోతిన ఎల్లాజీ,వి.శ్యామల,రాజం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More