మన ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా మెత్తగా ఉడికిపోవడం, లేదంటే ఎక్కువ అన్నం వండేయడం.. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు అన్నాన్ని పడేయకుండా, పప్పు నానబెట్టే పని, పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మిగిలిపోయిన అన్నంతో మంచి దోశలు వేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక కప్పు, బియ్యప్పిండి అర కప్పు, పెరుగు ఒక కప్పు, జీలకర్ర ఒక స్పూన్, పచ్చిమిర్చి నాలుగు, చిన్న అల్లం ముక్క, ఉప్పు ఒక స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కరకరలాడే ఈ దోశలను ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
అన్నం దోశలు తయారీ విధానం:ముందుగా మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని, బియ్యప్పిండి అర కప్పు, పెరుగు ఒక కప్పు, జీలకర్ర ఒక స్పూన్, నాలుగు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.



