96MEDIA – #AP INDIA

నీటి తో పొయ్యే దానికి సర్జరీ దాకా అవసరమా ?

  1. తగినంత నీరు తాగితే { పురుషులు నాలుగు లీటర్ లు , స్రీలు మూడు , పిల్లలు వయసు బట్టి ఒకటి నుండి రెండు } , ఆహారం లో పీచు తగినంతగా ఉంటే { ఆకుకూరలు, కాయగూరల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది } … కిడ్నీ లో రాళ్లు ఏర్పడవు . కిడ్నీ సమస్యలు రావు . అజీర్తి , మలబద్దకం , గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు రావు .
  2. ఉప్పు అధికంగా కాక తగినంతగా తింటే { రోజుకు ఒక వ్యక్తికి ఒక స్పూన్ చాలు .. చాల మంది ఆరు దాకా తింటారు } .. కీళ్ల నొప్పులు , బిపి అంటి సమస్యలు రావు . ఉప్పు లేని ఆహారం తినడం కాదు . ఉప్పు అవసరం లేని మొలకెత్తిన విత్తనాలు , ఖీర, కార్రోట్ లాంటివి తినడం , మామిడి కాయ జామ కాయ లాంటివి తినేటప్పుడు ఉప్పు వేసుకోక పోవడం .. పెరుగన్నం ఉప్పు లేకుండా తినడం { మొదటి నాలుగు రోజులు వాక్ అనిపిస్తుంది . అటు పైన ఉప్పు వేసిన పెరుగన్నం వాక్ అని పిస్తుంది . అసలు టేస్ట్ తెలుస్తుంది } .
  3. కార్బోహైడ్రేట్స్ అధికంగా తినడం తగ్గిస్తే షుగర్ సమస్య రాదు . అధిక బరువు సమస్య ఉండదు . బిపి కంట్రోల్ లో ఉంటుంది . కార్బోహైడ్రేట్స్ తగినంతగా అంటే బియ్యం తో చేసినవి { అన్నం , ఇడ్లీ దోస లాంటివి } గోధుమలతో చేసినవి { చపాతి , పూరి లాంటివి } ప్లేట్ లో ఒక పాలు అయితే ఖీర ఒక పాలు .. దుంప కూరలు కాకుండా మిగతా కాయగూరలు .. ఆకుకూరలు .. రెండు పాళ్ళు.. ప్రోటీన్ ఇచ్చే ఆహారం అంటే బ్రోకలీ , పుట్టగొడుగులు , పప్పు , జామకాయ , వేరుశనిగ
    గింజెలు , నల్ల శనిగెలు లేదా బ్రాన్ చనా , చికెన్ , మటన్ , ఫిష్ , రొయ్యలు లాంటివి ఒక పాలు .. అంటే అన్నం ఒక కప్పు అయితే మిగతావి నాలుగైదు కప్పులు తినాలి . అన్నం బ్రౌన్ రైస్ అయితే బెటర్ . రాగులు జొన్నలు అయితే ఇంకా బెటర్ . సామలు , కొర్రలు అందు కొర్రలు లాంటి సిరి ధాన్యాలు అయితే ఇంకా మంచిది .
  4. శరీరం పై ఎండ సోకేలా చూసుకొంటే ఇమ్మ్యూనిటి బలంగా ఉంటుంది . ఇన్ఫెక్షన్ ల బారిన పడే ప్రమాదం తగ్గిపోతుంది . ఎముకలు బలంగా ఉంటాయి . మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటివి రాదు .
  5. శరీరానికి తగినంత సి విటమిన్ ఇస్తే ఇమ్మ్యూనిటి బలంగా ఉంటుంది . నిమ్మ నారింజ పళ్లలో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది .
  6. వారానికి ఒక నువ్వుల లడ్డు తింటే శరీరానికి కావలసిన కాల్షియమ్ అందుతుంది . అప్పుడు ఎముకలు దంతాలు దృడంగా ఉంటాయి .
  7. రోజుకు మూడు నాలుగు వాల్నుట్స్ తింటే పిల్లలు బుద్ధిలో బృహస్పతులు అవుతారు . పెద్దవారిలో మతి మెరుపు సమస్యలు రావు . బుర్ర చురుకుగా పనిచేస్తుంది .
  8. మూడు నాలుగు వాల్నుట్స్ తినడం బాగా మాట్లాడడం చేస్తే వృద్ధుల్లో డెమెన్షియా రాదు .
  9. ఆకుకూరలు కాయగూరల్లో అంటి యాక్సిడెంట్ లు ఉంటాయి . శరీరానికి తగినంత అంటి యాక్సిడెంట్ లు అందిస్తే కాన్సర్ రాదు .
  10. కనీసం అరగంట నడిస్తే అనేక అనారోగ్య సమస్యలు దూరం .
Add to favorites 1

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More