96MEDIA – #AP INDIA

తెలుగువారిఆత్మగౌరవం ఎన్.టి.ఆర్.!:కార్పొరేటర్ మొల్లిహేమలత

96మీడియా,మధురవాడ:– తెలుగు వారి ఆత్మగౌరవం నలుదిక్కులా చాటిచెప్పిన అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీనందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సందర్భంగా 5వ వార్డు పరిధి పరదేశిపాలెం జాతీయ రహదారి చేరువలోఎన్.టి.ఆర్. నిలువెత్తు విగ్రహానికి 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టిడిపి రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు, విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు,బోయి వెంకటరమణ(శ్రీను) ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ.. తెలుగుజాతి ఉన్నతిని చాటిచెప్పిన మహానాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు.కేవలం పార్టీ స్థాపించిన 9 నెలలోనే అధికారంలోకి వచ్చింది అంటే అది ఎన్టీఆర్ దిక్సూచి అని,ఆయన ఆశయాలే మాకు స్ఫూర్తి అని అన్నారు.ఎన్టీఆర్ చేసిన సేవా కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలు గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు.మొల్లిలక్ష్మణరావు, వాండ్రాశి అప్పలరాజు,బోయి వెంకటరమణ(శ్రీను) మాట్లాడుతూ.. ప్రపంచదేశాలో ప్రముఖ కళాకారుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగువారి ఉనికిని దశ,దిశ,లకు చాటిచెప్పిన మహోన్నతవ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.ఆయన ఆశయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకురా వడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయిరమాదేవి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీనివాస్, వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్,యువత అధ్యక్షులు కొండపురాజు, సీనియర్ టిడిపి నాయకులు బోరఅప్పలసూరిబాబురెడ్డి, ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు,వార్డు బీసీ సెల్ అధ్యక్షులుబొడ్డేపల్లి రంగ,బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొత్తల శ్రీనివాసరావు,విశాఖ జిల్లా టీం తారక్ ప్రధాన కార్యదర్శి ఓలేటి శ్రావణ్,యువ నాయకులు సూర్య,మహిళా నాయకులు అరుణజ్యోతి,సరస్వతి, వియ్యపు సునీత,వనిత నరసమ్మ,సీనియర్ నాయకులు జోగేశ్వరరావుపాత్రో, సుజీరావు,ఇలిపిల్లి శివ, ఇల్లిపిల్లి నరసింహపాత్రుడు, నాగోతిగాంధీ,నాగోతి అప్పలరాజు,నాగేశ్వరరావు, చక్రి, బోట్టాలోకేష్,శ్యామ్,పిల్లా వెంకట్రావు,ఇల్లిపిల్లి వెంగళరావు,బోరఎర్రయ్యరెడ్డి, నూకరాజు,విష్ణు,మాధవ్, జగన్నాథం,బోయిరెడ్డి, ప్రసాదు ,పాపారావు,గాడు రాంబాబు,నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More