96MEDIA – #AP INDIA

ఘనంగా ప్రారంభమైన 10వ వైయస్సార్ కప్-2023 బాక్సింగ్ పోటీలు.

96మీడియా,మధురవాడ:- జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో మారుతి బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 10వ వై ఎస్ ఆర్ కప్ -2023 జిల్లా స్థాయి సీనియర్స్ మేన్&ఉమెన్ బాక్సింగ్ పోటీలు
శుక్రవారం సా,,చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ మధురవాడ లో ఘనంగా ప్రారంభమయ్యాయి.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరిట ఆయన జయంతి సందర్భంగా బాక్సింగ్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు వంకాయలు మారుతి ప్రసాద్ అన్నారు.నేటి నుండి నుండి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు పోటీలు నిర్వహిస్తున్నారు.జిల్లా నలుమూలల నుండి సుమారు 40 క్లబ్బులకు చెందిన 200మంది బాక్సర్లు ఈపోటీల్లో తలపడుతున్నారు.మొదటిరోజు 40 బౌట్లు జరగగా 80మంది బాక్సర్లు తలబడ్డారు.ముఖ్య అతిథులుగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రసాద్ రెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్& ఐటి ఏజెన్సీస్ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎన్.ఐ.ఎఫ్.ఎస్ సిఇఓ,విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి,నగరాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పిల్లాసుజాత సత్యనారాయణ,7వ వైకాపా అధ్యక్షులు పోతిన శ్రీనివాస్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దల్లి రామకృష్ణారెడ్డి,ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ,వెంకటేశ్వరరావు, టైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షులు బసనబోయిన ఆనందరావు, ప్రముఖ కళాకారులు కురిటి సత్యంనాయుడు,ఉప్పాడ అప్పారావు,తిరుపతి నాయుడు పాల్గొని పోటీలను ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని,రాష్ట్రస్థాయి జాతీయస్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు.
విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు,మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు. ఈకార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు దండు నాగేశ్వరరావు,కే నూకరాజు,ఐ సాయిప్రసాద్,వైకాపా నాయకులు అల్లాడ వెంకట్రావు, బంగారు ప్రకాష్,పసుపులేటి గోపి,బంక అప్పారావు, మగ్గురి వెంకట్రావు,టిడిపి నాయకులు వాండ్రాసి సత్యనారాయణ (జపాన్) జే.వై.అకాడమీ నిర్వాహకులు జగన్ తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More