96MEDIA – #AP INDIA

మరో విద్యుత్ ఉద్యమం…27న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన

96మీడియా, విశాఖపట్నం:- రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలకు
వ్యతిరేకంగా ఈనెల 27న విశాఖ నగరం సీతమ్మధార లో గల ఎ పి ఇ పి డి సి ఎల్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి నాంది పలుకుతూ మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు పిలుపు నిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా శనివారం జీవీఎంసీ 7 వ వార్డు మల్లయ్యపాలెం లో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించిన కార్యక్రమంలో పైడిరాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు చార్జీలు ఏడు సార్లు పెంచి… ప్రజలపై రూ.50 వేల కోట్ల భారం వేశారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని చండిఘర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో స్మార్టు మీటర్ ధర రూ ” 7900 లోపు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో వారి అనుయాయులకు మేలు చేకూర్చేవిదంగా రూ ” 32000 లకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, ఎం డి బేగం, కె మేఘారావు, జి వేళంగినిరావు, ఎం ఎస్ పాత్రుడు, త్రినాద్, రాంమహేష్,నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More