Bhadrachalam: చర్లలో రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
Bhadrachalam: చర్లలో రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
భద్రాచలం: ఈరోజు చర్ల మండలంలో రాహుల్ విజ్ఞాన్ స్కూల్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, పింఛన్లు మరియు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు, పింఛన్లు మరియు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అలాగే ప్రజలందరూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు, పోలీస్ శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.