96MEDIA – #AP INDIA

ముగిసిన విజ్జిస్ మధురవాడ ప్రీమియర్ లీగ్….విజేతగా నిలిచిన చంద్రంపాలెం ఎస్.ఎన్.డి. టైగర్స్

96మీడియా,మధురవాడ:-
ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో
ఏప్రిల్ 15నుంచి 23వరకు జరిగిన విజ్జిస్ మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎం.పి.ఎల్.ఘనంగా ముగిసింది.ఆదివారం సాయంత్రం మధురవాడ క్రికెట్ స్టేడియం బి.మైదానంలో విజేతలకు ట్రోఫీ మెమొంటాలను ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. 8ప్రధాన జట్లు పోటీ పడిన.. క్రికెట్ మ్యాచ్ లలో ఎం.పి.ఎల్.టైటిల్ విజేత చంద్రంపాలెం ఎస్.ఎన్.డి. టైగర్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది.
రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్న బి.వి.పి.బుల్స్. మూడవ స్థానాన్ని కొమ్మాది లయన్స్,నాలుగవ స్థానాన్ని మధురవాడ రాక్ స్టార్స్ కైవసం చేసుకున్నాయి.బెస్ట్ బ్యాట్స్ మాన్ వాండ్రాసి భాస్కర్( బికెపి రాయల్ స్ట్రైకర్స్),బెడ్స్ బౌలర్ సంతోష్ కుమార్(బివిపి బుల్స్),బెస్ట్ఆల్రౌండర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్..గణేష్(కొమ్మాది లయన్స్)గా నిలిచారు.ఈ సందర్భంగా..క్రికెట్ చరిత్రను తిరగరాసిన క్రీడాకారుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 50వ జన్మదిన సందర్భంగా 50 కేజీల కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ముఖ్య అతిథిగా హాజరైన…హనీ గ్రూప్ ఓబులరెడ్డి,నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత,సత్యనారాయణ, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్-లీడర్ కంపాహనోక్,జీవీఎంసీ 7వ వార్డ్ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ,వెంకట్రావు, మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నక్కా శ్రీధర్,మారుతి బాక్సింగ్ క్లబ్ వ్యవస్థాపకులు వంకాయల మారుతి ప్రసాద్,జగ్గుపిల్లి అప్పలరాజు,సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు ముదుండి రాజేశ్వరి,ఉమెన్&చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ మంతెన మాధవి వర్మ, ఎం.డి.అహమ్మద్,పోతిన ఎల్లాజీ,పోతినశివ,వాండ్రాశి రవి,సంయుక్తంగా.. విజేతలకు టైటిల్ జుట్టుకు ఒక లక్ష రూపాయలు,ట్రోఫీ.రన్నర్ 50,000ట్రోఫీ.ట్రోఫీలను అందించారు.ఈసందర్భంగా వక్తులు మాట్లాడుతూ..50 ఓవర్ల మ్యాచ్లను మర్చిపోయే తరుణంలో 20-20 మ్యాచ్లకు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీఎల్ కు దీటుగా విజ్జిస్ ఎం.పి.ఎల్. విజయం ఆనందాన్నిచ్చిందని, క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని,రాష్ట్రస్థాయి జాతీయస్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు.విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు.క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు,మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కె.వి.ఆర్ ఈవెంట్స్ గురునాథ్,కనకదుర్గ ఈవెంట్స్ కొర్రాయిసురేష్, నాగోతి వెంకట సత్యనారాయణ(జపాన్), పోతిన సోంపాత్రుడు,పోతిన చిన్ని, జగ్గుపిల్లినరేష్, పొట్టి ప్రసాద్,పోతిన హనుమంతు టిడిపి,సుబ్బారాజు.. తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More