96MEDIA – #AP INDIA

గోడలపై పోస్టర్లు కనిపిస్తే ఉపేక్షించేది లేదు…జివిఎంసి కమిషనర్ సి.ఎం.సాయికాంత్ వర్మ విజ్ఞప్తి..!

96మీడియా,విశాఖపట్నం:- నగరంలో ప్రభుత్వ ప్రైవేటు గోడలపై ఎటువంటి పోస్టర్లు కనిపించిన ఉపేక్షించేది లేదని జివిఎంసి కమిషనర్ సి.ఎం.సాయికాంత్ వర్మ వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శిలను హెచ్చరించారు. శనివారం ఆయన విఎంఆర్డిఏ చిల్డ్రన్ హెరీనా థియేటర్లో వార్డు సచివాలయ కార్యదర్శులతో ఇకో-వైజాగ్ లో భాగంగా పెయింట్ మై స్ట్రీట్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యదర్శులు ప్రతి ఒక్కరూ విధులు పట్ల నిబద్ధతతో పనిచేయాలని ఇకో-వైజాగ్ లో భాగంగా పెయింట్ మై స్వీట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీ పరిధిలో ఉన్న రోడ్ల ప్రక్క గోడలను గుర్తించి వాటికి ఆకర్షణీయంగా ఎన్జీవోస్ ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో స్కూల్ విద్యార్థులచే పెయింట్ వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నగర సుందరీకరణలో భాగంగా గోడలపై పోస్టర్లు కనిపిస్తే ఆ వార్డు సచివాలయ కార్యదర్శి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయ పరిధిలో నెలలో ఒకటి లేదా రెండు ఇల్లులు  నిర్మాణాలు జరుగుతాయని వాటిని ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతుందా లేదా, మూడు ఫ్లోర్లకి ప్లాన్ తీసుకొని నాలుగు ఫ్లోర్లు వేసిన సందర్భాలు ఉన్నాయని ఇటువంటివి గుర్తించి నిర్మాణ దశలోనే అడ్డుకోవాలన్నారు. దీని పూర్తి బాధ్యత కార్యదర్శిదేనిని తెలిపారు. చాలామంది కార్యదర్శులు పెనాల్టీ వేసిన సొమ్ము వారి వద్ద ఉంచుకున్నట్లు ఫిర్యాదులు  వస్తున్న దృశ్య ఇకపై ఇకో-వైజాగ్ యాప్ ద్వారా పెనాల్టీదారిడికి కట్టిన సొమ్ము యొక్క మెసేజ్ వెళుతుందని తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షన్ 2023కు కార్యదర్శులు అందరూ సహకరించి అనుకూలమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పాటు మీ పరిధిలో ఉన్న వారిచే మంచి ఫీడ్ బ్యాక్ ఇప్పించి స్వచ్ఛ సర్వేక్షన్ లో మొదటి ర్యాంకు కృషి చేయాలన్నారు.

అనంతరం పట్టణ ప్రణాళిక అధికారి సునీత మాట్లాడుతూ ప్లానింగ్ కార్యదర్శులు అందరూ వారి విధులు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రతిరోజు డైరీ నిర్వహణ ముఖ్యమని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి కార్యదర్శులు అందరూ విధుల్లో ఉండి వారి పరిధిలోని ఆక్రమణలు, భవన నిర్మాణ వ్యర్ధాలు లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిసిపిలు నరేందర్ రెడ్డి, పద్మజ, ఏసీపీలు, టిపివోలు, టీపీఎస్ లు వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More