96MEDIA – #AP INDIA

విశాఖలో ఉన్న  వర్కింగ్ జర్నలిస్ట్ లకు త్వరలో ఇళ్ల స్థలాల కేటాయింపు…. వై. వి. సుబ్బారెడ్డి

విశాఖలో ఉన్న  వర్కింగ్ జర్నలిస్ట్ లకు త్వరలో ఇళ్ల స్థలాల కేటాయింపు…. వై. వి. సుబ్బారెడ్డి

విశాఖ  జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు హమీ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి

ఇళ్ల స్థలం కేటాయింపుతో పాటు
బ్యాంకు ఋణం ఇప్పించాలని కోరిన సోసైటీ సభ్యలు

450 కి చేరిన సోసైటీ సభ్యుల సంఖ్య

96మీడియా,విశాఖపట్నం:-విశాఖ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తామని ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి ఇన్చార్జ్ వై వి సుబ్బారెడ్డి తెలియజేశారు ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని ఆయన తెలిపారు.  విశాఖ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఎండాడ వద్ద ఉన్న వైసిపి కార్యాలయంలో వై వి సుబ్బారెడ్డి ని కలిసి ఇళ్ల స్థలాల కోసం వినతి పత్రం సమర్పించారు. విశాఖలో ఉన్న అక్రిడేట్ జర్నలిస్టులు మరియు నాన్ అక్రిడేట్ జర్నలిస్టులు కూడా స్థలాలు కేటాయించాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టామని త్వరలో సుబవార్త   వింటారని వివరించారు  2005లో ఇచ్చిన ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరించారని అలాగే 2006 నుండి 2023 వరకు ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆమోదముద్ర వేశారని ఆయన వివరించారు. అక్రిడేట్ జర్నలిస్టులకు స్థలాలను కేటాయిస్తామని, నాన్ అక్రిడేట్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించటానికి ప్రణాలిక సిద్దంచేస్తున్నామని . స్థలాల కోసం విశాఖ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా చేయాలని ఆయన సూచించారు. సందర్భంగా సొసైటీ అధ్యక్షులు ఎల్జి నాయుడు కార్యదర్శి ఈశ్వర్ చౌదరి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రతి  జర్నలిస్టులకు ఐదు సెంట్ల స్థలంతో పాటు దానికి అయ్యే  ఖర్చు బ్యాంకు రుణం ద్వారా ఇప్పించాలని వైవీ సుబ్బారెడ్డికి తెలియజేశామని చెప్పారు. స్థలం కేటాయిస్తే దానికి నిధులు బ్యాంకు ద్వారా 80 శాతం ఋణ సదుపాయం కలిపించడం జరుగుతుందని తెలిపారు..గురుద్వార లోని స్మార్ట్ ఇన్ హోటల్లో ఆదివారంతో సభ్యత్వ నమోదు
కార్యక్రమం ముగిసిందని తెలిపారు. వై వి సుబ్బారెడ్డి ని కలిసిన వారిలో  ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసురావు,జాయింట్ సెక్రెటరీ నందకుమార్,ఆర్గనైజింగ్ సెక్రెటరీ భూపతి జార్జ్  తదితరులు పాలుగున్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More