96MEDIA – #AP INDIA

దీర్ఘకాలిక సమస్యలుకు శాశ్వత పరిష్కారం చూపండి…కమిషనర్ కు కార్పొరేటర్ మొల్లి హేమలత వినతి

మధురవాడ పై వంతెన సర్వీస్ రోడ్డు నందు వర్షపు నీటి నిల్వ సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలి

వార్డులో చెరువులు ఆక్రమణకు గురికాకుండా త్వరితగతిన అభివృద్ధి చేయాలి

కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కమిషనర్ కు వినతిపత్రం అందజేత

96మీడియా,మధురవాడ:– జీవీఎంసీ ఐదో వార్డ్ సమస్యలపై ఈరోజు కార్పొరేటర్ మొల్లి హేమలత కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ సాయి కాంత్ వర్మకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా 5,6,7,8 వార్డుల ప్రధాన జంక్షన్ అయినా మధురవాడ పై వంతెన దగ్గర వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, దశాబ్దాలుగా ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులు పనులు చేపట్టిన మళ్లీ ఆ సమస్య పునరావతం అవుతుందని, మధురవాడ ప్రజలు జీవీఎంసీ జోనల్ ఆఫీసుకు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కు, ఎలక్ట్రికల్ ఆఫీసుకు, జడ్పీహెచ్ స్కూలుకు, పోలీస్ స్టేషన్ కు, మధురవాడ మార్కెట్ మరియు రైతు బజార్ కు వెళ్లాలంటే ఈ మార్గంలోనే ఇబ్బంది పడుతూ వెళ్లడం జరుగుతుందని, కావున ఇప్పటికైనా కొమ్మాది జంక్షన్ నుండి చంద్రంపాలెం వరకు సర్వీస్ రోడ్డు పై గల వర్షపు నీటినిల్వ సమస్య శాశ్వత పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే వార్డులో గల బొట్టవానిపాలెం, నగరంపాలెం చెరువులు ఆక్రమణలకు గురికాకుండా త్వరితగతిన ప్రజాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, ఐదో వార్డ్ లో జే ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ కాలనీ ,రాజీవ్ గృహకల్ప, ఎన్టీఆర్ హుదూద్ కాలనీ తదితర కొత్త కాలనీలు చాలా ఉన్నాయని ఆయా కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ముఖ్యంగా ఆయ కాలనీలలో త్రాగునీరు,యూజీడి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలని మరియు అయ్యప్ప నగర్ త్రాగునీటి ప్రాజెక్టులో భాగంగా వికలాంగుల కాలనీ, డ్రైవర్స్ కాలనీ, కార్పెంటర్ కాలనీ ఏరియాలలో ఇంకా త్రాగునీటి పైప్ లైన్లు వేయవలసిన అవసరం ఉందని కావున త్వరితగతిన పూర్తి చేయాలని,సాయిరాం కాలనీ కొండపై భాగంలో త్రాగునీటి ప్రాజెక్టు గత కౌన్సిల్ సమావేశాల్లో నిధులు మంజూరు నిమిత్తం 15వ ఆర్థిక సంఘం కు పంపుతూ తీర్మానం చేయడం జరిగిందని వీలైనంత తొందరగా ఆ ప్రాజెక్టు మొదలయ్యేల చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వార్డులో వీధిలైట్ల సమస్య చాలా ఎక్కువగా ఉందని విస్తీర్ణం దృశ్య చాలా పెద్ద వార్డు అయినందువల్ల చాలా చోట్ల కొత్త వీధిలైట్లు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కావున వెంటనే క్రొత్త వీధిలైట్లు, చాలా చోట్ల రోడ్లు కాలువలు వేయవలసిన అవసరం ఉందని కావున వీటన్నిటికీ నిధులు మంజూరు చేయాలని మేయర్ హరి వెంకట కుమారి, కమిషనర్ సాయి కాంత్ వర్మకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More