96MEDIA – #AP INDIA

స్వర్ణ రజితాలంకృత దుర్గాదేవిగా చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు

96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవములు ఐదవ రోజు అంగ రంగ వైభవంగా జరిగాయి, ముందుగా అమ్మవారి విరాట్ కు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకములు జరిపించి అనంతరం ఈరోజ స్వర్ణ రజితాలంకృత దుర్గాదేవిగా అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలు నీరాజన మంత్రపుష్పం ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది, మరియు సూర్య నమస్కారాలు, ప్రత్యక పూజా కార్యక్రమాలు పసుపుకొమ్ములు పూజ భక్తులు అందరితో చేయించడం జరిగింది, అనంతరం ఖడ్గ మాలా హోమం, నీరాజన మంత్రపుష్పం, మొదలగు కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, హరిప్రసాద్ శర్మ, బృందం నిర్వహించారు.ఎండాడ వాస్తవ్యులు, పూర్వ జ్యోతి ధియేటర్ పొప్రైటర్ శ్రీ కొల్లి కృష్ణచంద్ర, గౌతమి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం తో ఆలయంలో ప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ ప్రతినిధులు పిళ్లా సూరిబాబు, యస్‌.యన్.మూర్తి,పి.వి.జి.అప్పారావు, నాగోతి తాతారావు, పిళ్లా శ్రీనివాసరావు, పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పోతిన శివ, గూడేల రాజు, పిళ్లా సన్యాసిరావు, కేశనకుర్తి అప్పారావు, పిళ్లా రమణ, పిళ్లా రాజు, మరుపిల్లి ఆనంద్, బంక వాసు, పిళ్లా శ్రీను, గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు,పీస రామారావు,బి. సత్యన్నారాయణ, జగుపిల్లి నాని, పిళ్లా సత్యన్నారాయణ,సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు,ఆలయ ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, జగుపిల్లి అప్పారావు, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న, గూడేల కామేశ్వరరావు, యం.వెంకటరావు, గరె రామారావు, పిళ్లా లక్ష్మణ పాత్రుడు, మరుపిల్లి బుల్లిబాబు, యస్.రమేష్, సతీష్, పిళ్లా సూరి పాత్రుడు, యస్.శ్రీను, పిళ్లా శ్రీను, కనకరావు, పి.రాంబాబు, అమ్మవారి సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More