96MEDIA – #AP INDIA

బుల్లిబాబు వద్దు… సుబ్బారావు ముద్దు..!చింతపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్…..

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతల సుబ్బారావు అని చింతపల్లి బహిరంగ సభలో మాట ఇచ్చిన వైయస్సార్ షర్మిలమ్మ మాట నిలబెట్టుకోవాలి

అల్లూరి సీతారామరాజు జిల్లా మండలం అన్నవరంలో కాంగ్రెస్ కార్యకర్త సమావేశం అయ్యారు

96మీడియా,అల్లూరి జిల్లా:- కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పాంగి రామకృష్ణ మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకుని మొదటి నుండి కూడా వంతల సుబ్బారావు ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండాను విడిచి పెట్టకుండా ఆదివాసి గివిజన గుండెల్లో కాంగ్రెస్ పార్టీ విలువలను నింపిన వంతల సుబ్బారావుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడం చాలా బాధాకరమని అధిష్టానం మరొకసారి ఆలోచించి వంతల సుబ్బారావుకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఇచ్చినట్లయితే మా ఆదివాసి గిరిజనలు అందరం ఒక్కటై ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని అధిష్టానమునకు బహుమతిగా ఇస్తామని అన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ముఖ్య నాయకులు శ్రీను, సింహాద్రిమాట్లాడుతూ అల్లూరి జిల్లాలో జీరో స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వేల సంఖ్యలో కార్యకర్తలను బలపరిచిన వంతల సుబ్బారావు కాకుండా వేరొకరు కు ఇవ్వడం చాలా అన్యాయం అన్నారు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అధిష్టానం మరొకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వాలని లేదంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయించి గెలిపిస్తామన్నారు,
కాంగ్రెస్ పార్టీలో వేరే ఒకరికి ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించి మా యొక్క ఆదివాసుల పివిటిజి కులాల బలాన్ని చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు సమావేశం అయ్యారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More