96MEDIA – #AP INDIA

దుర్గా థియేటర్ మజ్జిగ చలివేంద్రంకు విశేష స్పందన


96మీడియా, మధురవాడ:- దుర్గా థియేటర్ మజ్జిగ చలివేంద్రంకు విశేష స్పందన లభిస్తుందని దుర్గా థియేటర్ ఎండి పిళ్ళా భరత్ బాలాజీ పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రంపాలెంలోని దుర్గా థియేటర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గా థియేటర్ మజ్జిగ చలివేంద్రంకు విశేష స్పందన భరత్ బాలాజీ మాట్లాడుతూ ఈరోజు నుండి వేసవికాలం చివరి వరకు ఈ చలివేంద్రం ¹కొనసాగుతుందని ప్రతి ఆదివారం మజ్జిగ పంపిణీ చేపడతామని తెలిపారు. తమ థియేటర్ కు వచ్చే ప్రేక్షకులతోపాటు, చంద్రంపాలెం హైవేగా ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో పిళ్ళా ఆనంద్, లోకేష్, ఆర్ డి వి బాబు గ్రామస్థులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More