సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఏ.కోడూరు ఎస్ఐ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. కె.కోటపాడు మండలం ఏ.కోడూరు జంక్షన్లో శుక్రవారం ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా విద్యార్థులతో కలిసి వాక్‌థాన్, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్, నార్కోటిక్ పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించాలని ఎస్సై సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సమాజమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఏ. కోడూరులో డ్రగ్స్ వ్యతిరేక మానవహారం