కె.కోటపాడు, జూన్ 16(క్విక్ న్యూస్): కె.కోటపాడు పెట్రోల్‌బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొడుగుపాలెం గ్రామానికి చెందిన సూరెడ్డి జీవన్(11) తన బంధువైన కృష్ణతో కలిసి స్కూటీపై వెళ్తున్నాడు. మార్గమధ్యంలో స్కూటీకి పెట్రోల్ అయిపోవడంతో దానిని సమీపంలోని పెట్రోల్‌బంక్‌కు తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో కె.కోటపాడు వైపు నుంచి వచ్చిన మోటార్‌సైకిల్ స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో జీవన్, కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.వారిని స్థానికులు కె.కోటపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కృష్ణ చికిత్స పొందుతున్నాడు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆర్. ధనుంజయ్ తెలిపారు.