96MEDIA – #AP INDIA

స్టూడెంట్స్ యునైటెడ్ ఆధ్వర్యంలో ఘనంగా కలాం జయంతి వేడుకలు

96మీడియా, మధురవాడ:- భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని భీమిలి టీడీపీ ఇన్చార్జి కోరాడ రాజబాబు అన్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో కలాం – ఆప్ కో సలాం అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మిసైల్ మేన్ అబ్దుల్ కలాం అని, కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకోండి అని విద్యార్థులు, యువతలో స్పూర్తి నింపిన వ్యక్తి కలాం అన్నారు. ఆయన జయంతి సందర్భంగా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ భారతదేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత అబ్దుల్ కలాంకి దక్కుతుందన్నారు. సామాన్య కుటుంభం నుండి దేశ ప్రధమ పౌరుడు స్థాయికి ఎదిగి దేశాన్ని ప్రగతి పథంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కలాం అని ఆయన సేవలను కొనాయాడారు.  స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణ మూర్తి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆలోచనలను విద్యార్థి సమాజానికి చేరువ చేయాలనే లక్ష్యంతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ అహర్నిశలు కృషి చేస్తోందని, తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్ కలాం మొదటి విగ్రహాన్ని భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఘనత స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కర్రి నరేష్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇషాక్, కొయ్య రామకృష్ణ, సుధాకర్ పట్నాయక్,ఉత్తరాంధ్ర విద్యార్థి సేన సభ్యులు సన్యాసి నాయుడు శ్రీరామ్, చైతన్య7వ వార్డు విశాఖ పార్లమెంటరీ కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్, కార్యదర్శి కానూరి అచ్చుతరావు, ఐటిడిపి భీమిలి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి జెపి రాజు , బి సెల్ అధ్యక్షులు పోతిన బుజ్జి, జిల్లా బీసీ సెల్ కార్యవర్గ సబ్యులు పిల్ల రాము , కార్యకర్త బెండి జోగారావు, 5వ వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ , కార్యదర్శి ఈగల్‌ రవికుమార్‌, నమ్మి రమణ, భీమిలి నియోజకవర్గ మహిళా అద్యక్షులు బోయి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More