96MEDIA – #AP INDIA

విజయోత్సవాన్ని తలపించేలా అవంతి నామినేషన్ !

96మీడియా, భీమిలి:-అశేష జనం మధ్య ఊరేగింపు, కోలాహలంగా డప్పు వాయిద్యాలు, మహిళల కోలాట నృత్యాలు మధ్యవిజయోత్సవాన్ని తలపించే లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. అవంతి నామినేషన్ వెంట ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి,విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ,వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తదితరులతో వేల సంఖ్యలో వచ్చిన జన సమూహంతో ర్యాలీగా వెళ్లి భీమిలి ఆర్డిఓ భాస్కర్ రెడ్డికి నామినేష్ పత్రాలను అందజేశారు.నాలుగు మండలాల, 9 వార్డుల నుంచి అభిమానులు కార్యకర్తలు తండోపా తండాలుగా అవంతి నామినేషన్కు బారులు తీరారు.జనసాంద్రతతోభీమిలి సాగర తీరమం చిన్న పోయేలా వైసీపీ నినాదాలతో భీమిలి దద్దరిల్లింది. నియోజకవర్గ పరిధిలోని పీఎం పాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీ కొమ్మాది, మారికివలస ,అనందపురం ,తగరపువలస మీదుగా భీమిలి ఆర్డీవో కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో పిల్ల నదులన్నీమహాసముద్రంలో కలిసిన చందానఉరకలేసే ఉప్పెనల సాగింది.అనంతరం భీమిలి బీచ్ ఓడ్డున జరిగిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి మాట్లాడుతూ ప్రజలే నా బలం, భీమిలి అభివృద్ధి నా ధ్యేయం, నా గెలుపు ఇక తధ్యమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి లేని పాలన జగనన్న అందిస్తే.. భీమిలి అభివృద్ధి నా ధ్యేయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మధ్య తిరిగి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. భీమిలిలో విపక్షాలు ఎన్ని ఎత్తుగడలు వేసిన చిత్తవ్వడం ఖాయమని తెలిపారు. మళ్ళీ భీమిలిలో వైసీపీ జెండా ఎగురడం తద్యమన్నారు.రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతంలో టిడిపి అభ్యర్థి గంటా , ప్రస్తుతం అవంతి పాలన చూసిన ఇక్కడ విజ్ఞత కలిగిన ఓటర్లు గంటా వేస్ట్ అవంతి బెస్ట్ అంటున్నారు అన్నారు.తప్పకుండా భీమిలిలో విజయం సాధించి జగన్కు కానుకగా ఇస్తామని చెప్పారు.ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తన కన్నవారి నియోజకవర్గమైన భీమిలి ప్రజలఆశీర్వాదం మాకు మెండుగా ఉందనిఈ నామినేషన్ ఘట్టం లోపాల్గొన్న జన సముద్రాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పారు.రాష్ట్ర రాజధాని విశాఖ కావాలన్నా భీమిలి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నాఎన్నికల్లో విజయాన్ని తప్పకుండా అందివ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భీమిలి వైకాపా నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తం శెట్టి మహేష్, వైకాపా యూత్ వింగ్ ఉత్తరాంధ్ర అధ్యక్షులు నందీష్ బాబు , శ్రావణ్ కుమార్, కార్పొరేటర్లు ,సర్పంచులు, మండల అధ్యక్షులు ,జిల్లా పరిషత్ సభ్యులు తదితరులతోపాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More