96MEDIA – #AP INDIA

పీడిత ప్రజల ప్రియతమ నేత సుందరయ్య:సీఐటీయూ

96మీడియా, మధురవాడ:- స్వార్థ రాజకీయాలు,దోపిడీ వ్యవస్థ నుండి మానవాళిని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని,దానిని చేరుకోవడానికి పుచ్చలపల్లి సుందరయ్య  మార్గంలో పయనించాలని సిఐటీయు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ కోరారు.శుక్రవారం సుందరయ్య 38 వ వర్ధంతి నీ, జీ వి ఎం సి 6 వ వార్డు పిఎం పాలెం ఎస్ బి ఐ సమీప కూడలి వద్ద నిర్వహించారు.ముందుగా సుందరయ్య చిత్ర పటానికి జీ వి ఎం సి యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం వి ప్రసాద్ పువల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కార్యకర్తలందరు పువలతో నివాళులు అర్పించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ ప్రధాన వక్తగా మాట్లాడుతూ కార్మికులు పైన,రైతులు పైన,సామాన్య ప్రజల పై నిర్భంధం ప్రయోగిస్తూ దోపిడీ దార్లు నిరాటంకంగా దోచుకోవడానికి, నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నిర్భంధం ప్రయోగిస్తున్నాయని అన్నారు.
ఈ నిర్భందాలను ఎదుర్కోవడానికి సుందరయ్య పోరాట మార్గం ను అందరూ అనుసరించాలని కోరారు.
సుందరయ్య వంటి ఆదర్శ రాజకీయ నాయకుల అవసరం వుందని అన్నారు.భూస్వామ్య కుటుంబంలో పుట్టి శ్రామిక ప్రజల అభి వృద్ధి కోసం పాటు పడ్డారని తెలియ జేశారు.తనకు వాటాగా వచ్చిన ఆస్తిని ప్రజా ఉద్యమాలకు ఇచ్చిన త్యాగ మూర్తి అని అన్నారు.
తెలంగాణ నిజం పాలనలో బానిస విముక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గొప్ప విరుడని కొనియాడారు.
ఆ పోరాటం లో ఆయన చూపిన తేగువ,చేసిన త్యాగాలు భారత జాతికి గర్వకారణమన్నారు.
ఆ స్ఫూర్తితో నేటి ఈ పాలకుల దోపిడీ విధానాలను తిప్పి కొట్టాలని కోరారు.ఈ కార్యక్రమం లో సీపీఎం జోన్ కమిటీ కార్యదర్శి డి అప్పలరాజు,యూనియన్ నాయకులు ఎస్ రామప్ప డు, సి హెచ్ శేషు బాబు,కే నాగరాజు,జీ కిరణ్,కే రాజ,బి రాంబాబు,కే అర్జునమ్మ,ఉమ,జీ ఏ రెడ్డి,అది లక్ష్మి,శుభ,సూరిబాబు,తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More