96MEDIA – #AP INDIA

ప్రముఖుల చేతుల మీదుగా చంద్రంపాలెం గ్రామ దేవత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఊరీ పండుగ గోడ పత్రిక ఆవిష్కరణ

96మీడియా,విశాఖపట్నం:- జిల్లా మధురవాడ చంద్రంపాలెం గ్రామ దేవత చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువైయున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి మహోత్సవములు (ఊరీ పండుగ) గోడ పత్రికను టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి గారు స్థానిక శాసన సభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది,

విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం గ్రామ దేవతల ఉత్సవాలు గత నెల 5వ తేదీన ప్రారంభమయ్యాయని తేది 5/5/2023 పండగ చాటింపు, తేది 6/5/2023 న శ్రీ ఎర్నమ్మ, దండుమారమ్మ అమ్మవార్లకు, తేది 7/5/2023 మరిడమ్మ పండగ, 9/5/2023 శ్రీ బంగారమ్మ తల్లి పండగ, తేది 23/5/2023 న శ్రీ మొగధారమ్మ తల్లి పండగ, తేది 30/5/2023 శ్రీ కొత్తమ్మ తల్లి పండుగలు జరిగాయని తెలిపారు,

ముఖ్యంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి పండగకి సంబంధించి ఈరోజు తేది 4/6/2023 మరిడమ్మ పండగ , తేది 5/6/2023
శ్రీ దుర్గాలమ్మ దేవర తీసుకురావడంతో శ్రీ దుర్గాలమ్మ పండగ ప్రారంభం అవుతుందని
శ్రీ దుర్గాలమ్మ దేవరను తేది 5/6/2023 సోమవారం రాత్రి కి తీసుకొని వచ్చి చంద్రంపాలెం గ్రామ అమ్మవారి చదును పట్టు (వేపచెట్టు) వద్ద ఉంచిన తర్వాత నుండి ప్రధాన పండుగ ప్రారంభం అవుతుంది, అక్కడ నుండి తొమ్మిది రోజులు ప్రతీ రోజు తెల్లవారు జామున చద్దన్నం దండడం, ఉదయం 10 గంటల సమయంలో జోగి దండడం, సాయంత్రం వేళల్లో అమ్మవారి గటాలు తిరగడం, రాత్రి 7గంటల నుండి వాలకాలు కార్యక్రమాలు ఉంటాయని ఇలా తొమ్మిది రోజులు అమ్మవారి చదును పట్టు వద్ద జరుగుతాయి, తేది 12/6/2023 సోమవారం రాత్రికి తొలేళ్లు ఉత్సవం, తేది 13/6/2023 మంగళవారం ప్రధాన పండుగ ఆరోజు ఉదయం చద్దన్నం దండడం, ఉదయం జోగి దండడం, నూకాలమ్మ పసుపు కుంకుమ సమర్పించడం, అనంతరం ఉయ్యాల కంబాల ఎత్తడం మధ్యాహ్నం 1:00గంటకు పాలధార తిరగడం , అనంతరం అమ్మవారి గటాలు గ్రామంలో తిరగడం , అనంతరం అమ్మవారి సంబరం ప్రారంభం కానుంది ముందుగా అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి ఊపడం అక్కడ నుండి సంబరం మేళ తాళాలు మంగళ వాయిద్యాలు, వివిధ నేల డాన్సులు పలుసాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం తో అనుపు కార్యక్రమం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు,

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు,
శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, పీస రామారావు, జగుపిల్లి నాని, బోగవిల్లి నాని, పిళ్లా సత్యనారాయణ,

ఆలయ అర్చకులు పట్నాల హరి ప్రసాద్ శర్మ,
ఆలయ కమిటీ కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్లా వెంకట రమణ, గూడేల రాజు, పొట్నూరి హరికృష్ణ, పిళ్లా రమణ, పిళ్లా సన్యాసిరావు,

ఆలయ ముఖ్య సభ్యులు పిళ్లా రాము, పిళ్లా అప్పన్న, పిళ్లా సూరి పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More